MBNR: జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు తమ ధాన్యం నిల్వలు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గాలి వేగం గంటకు 30-50 కి.మీ వరకు ఉండే అవకాశం ఉందని వెల్లడించారు.