HNK: నగరంలోని రాగన్న దర్వాజా ప్రాంతంలో గల బ్రాహ్మణ భవనంలో మంగళవారం వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా ఆది శంకరాచార్యులు, భగవత్ రామానుజాచార్యుల జయంతి ఉత్సవాలు ఒకే వేదికపై వైభవంగా నిర్వహించారు. బ్రాహ్మణ, వైష్ణవ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి MLA రాజేందర్ రెడ్డి సతీమణి నీలిమ రెడ్డి హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు.