KMR: ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పట్టుకున్న పలు వాహనాలను ఈ నెల 15న వేలంపాట నిర్వహించనున్నట్లు కామారెడ్డి ఎక్సైజ్ సీఐ వసంత కృష్ణ తెలిపారు. కామారెడ్డి మండల పరిధిలోని నరసన్నపల్లి వద్ద ఉన్న ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు వేలంపాట నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గలవారు రూ.5,000 డిపాజిట్ చేసి, వేలం పాటలో పాల్గొనాలని ఆయన సూచించారు.