NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యే కాసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి శనివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.