BDK: ఇల్లందు మైనారిటీ గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థి ఎండీ షెహజాద్ ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో ప్రతిభ చాటాడు. బైపీసీ విభాగంలో 440లో 436 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడో స్థానం దక్కించుకున్నాడు. ఈ విజయంపై కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.