SRD: హత్నూర మండలంలో “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక”పై మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎం.ఏ. ఫహీం ముఖ్య అతిథిగా హాజరై అభివృద్ధి కార్యక్రమాల అమలుపై అధికారులతో సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.