ASF: వాంకిడి మండలం ఎనోలి గ్రామానికి చెందిన 20 మంది బీజేపీ నాయకులు, BRS మండల అధ్యక్షులు డాక్టర్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం BRSలో చేరారు. MLA కోవ లక్ష్మి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై తాము పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాటగూడ సర్పంచ్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.