BDK: భద్రాచలం ఆర్టీఏ చెక్పోస్ట్ వద్ద ఎక్సైజ్ అధికారులు వాహన తనిఖీల్లో గంజాయి రవాణాను అడ్డుకున్నారు. సీలేరు–మోతుగూడెం నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని, సుమారు 20 కేజీల గంజాయి, కారు, బైక్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు తరలించారు. సీజ్ చేసిన గంజాయి విలువ రూ.11 లక్షలు ఉంటుందన్నారు.