KNR: ఇటీవల జరిగిన నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఆరవ తరగతి ప్రవేశానికి హుజురాబాద్ మండలం జాపాక గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని పిండి హరిణి రాష్ట్రస్థాయిలో 4వ బ్యాంకు సాధించినట్లు హెడ్ మాస్టర్ గుడిపాటి సవిత తెలిపారు. విద్యార్థిని 95 మార్కులు పొందినట్లు పేర్కొన్నారు. ఈ విద్యార్థిని గ్రామ సర్పంచ్ స్వప్న, టీచర్లు, గ్రామస్తులు, విద్యార్థుల అభినందించారు.