MBNR: పాలమూరు విశ్వవిద్యాలయ సోషల్ వర్క్ విభాగం, యశోద ఫౌండేషన్‌తో ఎంఓయూ (MOU) కుదుర్చుకుంది. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.రమేశ్ బాబు, ఫౌండేషన్ మేనేజర్ ఎం.శంకర్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం వల్ల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు.