SRD: పుల్కల్ మండలం ఇసోజీపేట గ్రామ శివారులో సంగారెడ్డి-సింగూర్ ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మిన్పూర్ గిరిజన తండాకు చెందిన జైసింగ్ (35) బుధవారం రాత్రి బైకుపై ఇంటికి వెళుతుండగా ఇసోజీపేట వద్ద ఉన్న వడ్ల కుప్పను ఢీకొన్నాడు. తీవ్ర గాయపడిన ఆయనను పుల్కల్ PHCకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.