MBNR: బాలానగర్ మండలం పంచాంగుల గడ్డ తండాలో 2 నెలలుగా బోరు మోటార్ మరమ్మతుకు గురవడంతో తాగునీటి ఎద్దడి ఏర్పడిందని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. వేసవి దృష్ట్యా నీటి కొరత తీవ్రంగా ఉందని, వెంటనే మోటార్ బాగు చేయించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.