SDPT: సీసీ కెమెరాలు నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. బెజ్జంకి మండలంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో సమావేశమై అవగాహన కల్పించారు. ఒక్క కెమెరా వంద మంది పోలీసుల పనిని చేస్తుందన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐ ఎం.శ్రీను, ఎస్సై సౌజన్య పాల్గొన్నారు.