VKB: హోలీ పండుగ సమీపిస్తున్న వేళ వికారాబాద్ జిల్లాలో ప్రకృతి రంగుల విందు చేస్తోంది. పెద్దేముల్ మండల పరిధిలోని జనగాం, మారేపల్లి, మంబాపూర్, తట్టేపల్లి, అడికిచెర్ల, ఇందూర్ సహా పలు గ్రామాల్లోని పొలాల గట్లు, అటవీ ప్రాంతం మోదుగ పూలతో ఎర్రగా మెరిసిపోతోంది. రోడ్డుకు ఇరువైపులా విరబూసిన ఈ పూలు అగ్ని కీలల్లా కనిపిస్తూ బాటసారులను కట్టిపడేస్తున్నాయి.