NZB: నిజామాబాద్ కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో మంత్రి సీతక్క అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. 99 రోజుల ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా అధికారులు ఏసీ గదులు వదిలి గ్రామాల బాట పట్టి సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలన్నారు.