RR: మొయినాబాద్ మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) సంధ్యకు పదోన్నతి లభించింది. గత నాలుగేళ్లుగా మొయినాబాద్లో ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు సమర్థంగా అమలు చేసి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. ఆమె కృషి, నిబద్ధత, పారదర్శకతకు గుర్తింపుగా డిప్యూటీ సీవోగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు.