MLG: నిర్భయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం “మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు” (Inclusive Cities for Women and Girls) కార్యక్రమాన్ని చేపట్టింది. దీంట్లో భాగంగా తెలంగాణలోని ములుగు జిల్లాను ఎంపిక చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కలిసి కృతజ్ఞతలు తెలియజేసి పలు అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు.