వనపర్తి జిల్లాలో ఇంటర్మీడియట్కు సంబంధించి బుధవారం నుంచి జిల్లాలో మొత్తం 12,653 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అంజయ్య తెలిపారు. వారిలో ప్రథమ సంవత్సరం 6,216 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 6,437 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. జిల్లాలో 25 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.