PDPL: భారతదేశంలో ఉన్న హిందూ సమాజాన్ని ఐక్యంగా నిలిపేందుకు హిందూ ధర్మ రక్షణ సమితి కృషి చేస్తుందని ప్రతినిధులు రేగటి రాజేష్, వడ్డేపల్లి భారతి, తోడేటి శంకర్ గౌడ్ అన్నారు. GDK ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రతినిధులు మాట్లాడుతూ.. ఈనెల 12న ఫైవింగ్లెన్ ఏరియాలోని మార్గదర్శి స్కూల్ ఆవరణలో హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు.