సత్యసాయి: సోమందేపల్లిలో బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై పోలీసులు ఫోర్ఫీచర్ ప్రక్రియ ప్రారంభించారు. విచారణ అనంతరం ముగ్గురు వ్యక్తులు తమ తప్పును అంగీకరించి విధించిన అమౌంట్ చెల్లించినట్లు ఎస్సై సుధాకర్ యాదవ్ తెలిపారు. అలాగే భూ తగాదాలు వంటి వివాదాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణపై మరో ఐదుగురిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు.