MDK: దండుపల్లి గ్రామ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని సర్పంచ్ మరాఠి నాగరాజు పేర్కొన్నారు. సోమవారం ఆయన అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో పాలకవర్గంతో కలిసి గ్రామంలోని పలు సమస్యలపై చర్చించారు. అనంతరం గ్రామ పురోభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై పలు తీర్మానాలు చేశారు. అందరి సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.