MDK: తూప్రాన్ పెద్ద చెరువు కట్ట బతుకమ్మ ఘాట్‌లో శివంపేట మండలం దంతాన్ పల్లికి చెందిన గజేంద్రుల బాలమని (75) చెరువులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన ఓ వ్యక్తి 100 డయల్ చేయడంతో పోలీసులు రవి, మహేష్ అక్కడికి వెళ్లి ఆమెను రక్షించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆమె కుమారుడు శంకర్‌కు ఆమెను అప్పగించారు