NRPT: మక్తల్ మున్సిపాలిటీ కేంద్రంలోని 6 వ వార్డు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు నర్సింహులు, బీజేపీ అభ్యర్థిని కులం పేరుతో దూషించినట్లు ఫిర్యాదు అందిందని ఎస్ఐ భాగ్య లక్ష్మి రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారం అడ్డుకున్నారని బాధితులు ఫిర్యాదు చేయడంతో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.