NLG: డిండి మండలం సింగరాజుపల్లిలో కల్వకుర్తికి అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శనివారం సాయంత్రం పోలీసులు పట్టుకున్నారు. వివిధ గ్రామాల్లో తక్కువ ధరకు సేకరించిన బియ్యాన్ని వాహనంలో తరలిస్తుండగా, ఎస్సై బాలకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి, నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.