KMM: ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి నగరంలోని బైపాస్ రోడ్డు, కొత్త బస్టాండ్ వంటి ప్రాంతాలలో రోడ్డు భద్రతా పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో గుర్తించిన 30 బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నివారణకు జీబ్రా క్రాసింగ్లు, సోలార్ బ్లింకర్స్, సైన్ బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.