HNK: ఎల్కతుర్తి ఎస్సై ప్రవీణ్ కుమార్‌పై అవినీతి, అక్రమాల ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఆయనపై బదిలీ వేటు పడింది. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గురువారం ఆయనను సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్)కు అటాచ్ చేశారు. ప్రస్తుతం స్టేషన్ బాధ్యతలను సీఐ పర్యవేక్షిస్తున్నారు.