NLG: రామన్నపేట మండలం నీర్నెములలో 6వ వార్డు అభ్యర్థి ముత్యాల కిషన్ తనదైన శైలిలో ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. వార్డులో ఇంటింటికి తిరుగుతూ.. ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో అభివృద్ధి చేస్తానని పలు హామీలు ఇస్తున్నారు. మంగళవారం ప్రచారంలో భాగంగా గంపలు అల్లే వారి వద్దకు వచ్చి ఓటును అభ్యర్థిస్తూ.. గంపలు అల్లారు.