మహబూబ్ నగర్ జిల్లాలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా కర్నూలు సిటీ-కాచిగూడ (17024) రైలు రాకపోకల్లో మార్పు చేశారు. ఈనెల 13, 15, 17 తేదీల్లో రైలు 2 గంటలు ఆలస్యంగా నడవనుంది. రైల్వే భద్రత, సామర్థ్యం పెంపు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.