NLG: సాగర్ ఆయకట్టు పరిధిలో వరి కోతలు ముమ్మరమయ్యాయి. అయితే పొలాల్లో విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉండటంతో హార్వెస్టర్లకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తాజాగా మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడులో కోత యంత్రం ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందడం విషాదం నింపింది. డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి, విద్యుత్ లైన్లను గమనిస్తూ కోతలు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు.