కృష్ణా: జిల్లాలో ఆధునిక టోల్ విధానం అమల్లోకి వచ్చింది. వెదురుపావులూరు సమీపంలోని NHపై ఉన్న టోల్ ప్లాజాను పూర్తిగా క్యాష్‌లెస్, బూత్లెస్ విధానంగా మార్చారు. ఏప్రిల్ 10 నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇకపై వాహనదారులు ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులు చేయాలి. బ్యాలెన్స్ లేకుంటే టోల్ వద్దే డిజిటల్ చెల్లింపు చేసి, అదనంగా 25 శాతం రుసుము చెల్లించాలి.