KMM: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 5న హైదరాబాద్లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఆయనకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.