NGKL: ఉప్పునుంతల మండలం కొరటికల్కు చెందిన టీ-శాట్ సీఈవో బోదనపెల్లి వేణుగోపాల్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక బాధ్యతలు అప్పగించింది.