BHPL: జిల్లా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ ఆనకట్ట దిగువన గోదావరి నదిలో పురాతన శిల్పాలు బయటపడ్డాయని స్థానికులు పేర్కొన్నారు. నీరు తగ్గిపోవడం, ఇసుక కొట్టుకుపోవడంతో బండపై చెక్కిన శివలింగం, నంది ఆకృతులు కనిపించాయి. ఈ శిల్పాలు కొన్నేళ్లుగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. పురావస్తు ప్రాధాన్యం ఉన్న ఈ శిల్పాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు.