MBNR: బాలానగర్ మండలంలోని గుండేడులో సోమవారం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి-ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ లెనిన్ గ్రామస్థులకు రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు జాగ్రత్తలు వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఆయన సూచించారు.