NZB: అటు అంతర్జాతీయ మార్కెట్లో పసుపునకు మంచి డిమాండ్ ఉండగా… స్థానికంగా మాత్రం ధర భారీగా తగ్గించడపై నిజామాబాద్ మార్కెట్ యార్డు భగ్గుమంది. రైతులు బుధవారం సైతం ఆందోళనబాట పట్టారు. ఈ నెల 10న పసుపు క్వింటా రూ.16 వేలు పలికింది. తాజాగా క్వింటాకు రూ.3 నుంచి రూ.4 వేలు ధర తగ్గించడంపై రైతులు మండిపడుతున్నారు.