AP: కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం విచారకమని అన్నారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులు ఈ ప్రమాదంలో మృతి చెందడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు.