TG: చైన్ స్నాచింగ్‌కు యత్నించిన నేరస్తుడిని ధైర్యంగా పట్టుకున్న రిటైర్డ్ ఆర్మీ జవాన్ చీర్ల రాముడిని HYD పోలీస్ కమిషనర్ సజ్జనార్ అభినందించారు. ఈ నెల 14న అంబర్‌పేట ఇరానీ హోటల్ బస్‌స్టాప్ వద్ద బస్సు దిగుతున్న సమయంలో రాముడి మెడలోని బంగారు గొలుసును అపహరించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. రాముడు ధైర్యంగా ఎదుర్కొని నిందితుడిని పట్టుకున్నాడు.