MDK: చిన్నశంకరంపేట మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన జనగణన శిక్షణ కేంద్రాన్ని తహసీల్దార్ మాలతి ఇవాళ పరిశీలించారు. ఇవాళ్టి నుంచి ఆరు రోజుల పాటు ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మొత్తం 78 మందిని రెండు బృందాలుగా విభజించి, ఒక్కో బృందానికి మూడు రోజుల పాటు శిక్షణ అందిస్తామన్నారు.