AP: పునర్విభజన బిల్లుపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘డీలిమిటేషన్ బిల్లుని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలియదు. గతంలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం సీట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా 24 శాతం సీట్లు కేటాయించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా 50 శాతం సీట్లు పెంచుతున్నారు. జనాభా ప్రకారం పెంపు అనేది రాష్ట్రంలోనే జరుగుతుంది’ అని పేర్కొన్నారు.