కోనసీమ: భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని కలెక్టర్ మహేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని కార్మికులందరూ తప్పని సరిగా తమ పేర్లను నమోదు చేసుకుని, ఆర్థిక ప్రయోజనాలను పొందాలన్నారు. వయో పరిమితి 18 నుండి 60 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు పథకానికి అర్హులన్నారు. నమోదు రుసుము క్రింద రూ. 50 చెల్లించాలన్నారు.