అన్నమయ్య: అగ్నిమాపక వారోత్సవాలలో 4వ రోజు సందర్భంగా రాయచోటిలోని ఓ పాఠశాలలో ఫైర్ డెమో కార్యక్రమం నిర్వహించారు. రాయచోటి ఫైర్ ఆఫీసర్ వెంకటరామిరెడ్డి, సిబ్బంది విద్యార్థులకు రక్షణ చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. వివిధ రకాల విపత్తులు సంభవించినప్పుడు భయపడకుండా సమయోచిత విధానంపై ప్రాక్టికల్‌గా డెమో ఇచ్చారు.