SKLM: కొత్తూరు మండలం సిరుసువాడ గ్రామంలో సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని అన్నారు. భవణ నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి, సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని CITU కన్వీనర్ పనస రమేశ్ డిమాండ్ చేశారు.