CTR: జన గణనలో ప్రజలు వాస్తవ సమాచారం అందించి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జన గణనలో భాగంగా ముందుగా చేపట్టే గృహ గణనలో స్వీయ నమోదు గురించి కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి వివరాలు ఎంతో కీలకం అని తెలిపారు.