సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న ‘కరుప్పు’ చిత్రం మే 14న విడుదల కానుంది. ఈ మూవీలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. అయితే, త్రిషతో ఎప్పటి నుంచో సినిమా చేయాలని కల కన్నానని, గతంలో ఓ అవకాశం చేజారిపోయినా.. ఇప్పుడు ‘కరుప్పు’ ద్వారా అది నెరవేరిందని ఆర్జే బాలాజీ తెలిపాడు. అందుకే ఆమెను ఈ కథలో ప్రత్యేకంగా తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నాడు.