MDK: అల్లాదుర్గం మండలం అప్పాజీపల్లి గ్రామంలో యువతి ఎర్రోళ్ల రూప (21) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న రూపకు వారం రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది. పెళ్లి నిశ్చయమైన కొద్ది రోజులకే ఆమె సూసైడ్ చేసుకోవడం స్థానికంగా కలకలం రేపంది. ఈ ఘటనలో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.