NGKL: లింగాల, బల్మూరు మండలాల అధికారులతో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వేసవి కాలం దృష్ట్యా ఉపాధి హామీ పనుల ప్రణాళికను వేగవంతం చేయాలని ఎంపీడీవోలు, ఏపీవోలను ఆదేశించారు. కూలీలకు ఇబ్బంది కలగకుండా పనులు కల్పించాలని, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన సూచించారు.