NZB: కమ్మర్పల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం ఉదయం 10:00 గంటలకు ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి రమ్య శ్రీ తెలిపారు. ఈ సదస్సులో సాగు పద్ధతులు, సబ్సిడీలు, ఎరువుల యాజమాన్యం, అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం పొందే మార్గాలపై నిపుణులు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు.