WGL: GWMC 20వ డివిజన్ పరిధి కాశిబుగ్గలోని రంగనాయక స్వామి ఆలయంలో గల దక్షిణముఖ ఆంజనేయస్వామికి మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. హనుమాన్ మాసోత్సవాల సందర్భంగా ఉదయం స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం 1,008 వడలతో స్వామిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. స్థానిక భక్తులు ఆలయానికి చేరుకొని స్వామికి పూజలు చేస్తున్నారు.