MNCL: జన్నారం మండలంలోని అక్కపెల్లి గూడ యువజన కాంగ్రెస్ గ్రామ కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడుగా గొల్లపల్లి తేజ, మండల కార్యదర్శి గొట్ల అక్షయ్, ప్రధాన కార్యదర్శిగా గడిపెల్లి సాయిరాజ్‌ను ఎంపిక చేశారు. యువత పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మండల అధ్యక్షుడు దాసరి గణేష్, NSUI రాష్ట్ర నాయకుడు సోహైల్ షా కోరారు.