NLG: నల్గొండలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్‌లో మంగళవారం జరిగిన అఖిలభారత వడ్డెర సంక్షేమ సంఘం సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. కష్టానికి మారుపేరు వడ్డెరులని, వారి పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిందని తెలిపారు. వచ్చే నెల నామినేటెడ్ పోస్టుల్లో వడ్డెర సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి తెలిపారు.